కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కేంద్ర బృందాల పర్యటన

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కేంద్ర బృందాల పర్యటన

లాక్‌డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం కరోనా కట్టడికి కఠిన చర్చలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలకు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. 15 రాష్ట్రాల్లో మొత్తం 50 జిల్లాలు, మున్సిపాలిటీలకు పలువురు నిపుణులను కేంద్ర ఆరోగ్యశాఖ నియమించింది. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, అస్సాం, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి జిల్లాలు, మున్సిపాలిటీలలో పర్యటించనున్నారు. ఈ బృందంలో ప్రజారోగ్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు, వైద్యులు, సీనియర్ జాయింట్ సెక్రటరీ స్థాయి నోడల్ అధికారి ఉంటారు. వీరంతా.. కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలు, సమర్థవంతమైన చికిత్స అందించడంలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు తోడ్పాటు అందిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story