తెలంగాణ చేసిన పనే తమిళనాడూ..

తెలంగాణ చేసిన పనే తమిళనాడూ..
X

కరోనా వ్యాప్తి, హైకోర్టు తీర్పు ఈ గందర గోళంలో పరీక్షలు పెట్టి ఇబ్బందుల పాలు చేయడం ఎందుకుని భావించి తెలంగాణ ప్రభుత్వం పదవతరగతి విద్యార్ధులను ప్రమోట్ చేసే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే బాటలో పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా పయనిస్తోంది. పది, పదకొండు తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవడమే ఈ నిర్ణయానికి కారణమని ముఖ్యమంత్రి పళని స్వామి తెలిపారు. జూన్ 15న పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టును కోరగా మొట్టికాయలు వేసి పంపింది. పబ్లిక్ పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడతారా అని ప్రశ్నించింది. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు పరీక్షల ఆలోచన చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయడమే మంచిదనే ఏకాభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.

Tags

Next Story