జూలై31 నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షల కరోనా కేసులు: ఢిల్లీ డిప్యూటీ సీఎం

జూలై31 నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షల కరోనా కేసులు: ఢిల్లీ డిప్యూటీ సీఎం

జూలై 31నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షల కరోనా కేసులు బయటపడతాయని ఢిప్యూటీ సీఎం మనీష్ సిసోడయా అన్నారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై లెప్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ హాజరైయ్యారు. సమావేశం తరువాత మాట్లడిన మనీష్ సిసోడియా జూన్ 31 నాటికి ఐదున్నర లక్షల కరోనా కేసులు బయటపడతాయని అన్నారు. అయితే, ఢిల్లీలో సామాజిక వ్యాప్తి లేదని ఆయన తెలిపారు. కానీ, ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోందని కొందరు చెబుతున్నారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా సామాజిక వ్యాప్తి జరుగుతుందని.. కరోనా ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో అర్థం కావటం లేదని అన్నారు. అయితే, మనీష్ సిసోడియా మాత్రం సామాజిక వ్యాప్తి లేదని అంటున్నారు. అటు, కరోనా టెస్టులు చేస్తున్న వారిలో ఎక్కవగా కరోనా బయటపడటం ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 3700 కరోనా టెస్టులు చేయగా.. 1007మంది కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే సుమారు 27 శాతం మందికి కరోనా మహమ్మారి సోకినట్టు తేలింది. దీంతో సర్వత్రా ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story