ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.. కరోనా విజృంభించే అవకాశాలున్నాయని..

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.. కరోనా విజృంభించే అవకాశాలున్నాయని..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలి పెట్టేటట్లు కనిపించడం లేదు. కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదే విషయమై హెచ్చరిస్తోంది. వైరస్ ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా దక్షిణాసియా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం నమోదైన వివరాలను బట్టి 10 దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆదివారం అత్యధికంగా 1,36,000 కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

ఆఫ్రికా దేశాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందని టెడ్రోస్ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికి తక్కువగానే నమోదవుతున్నప్పటికీ.. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపారు. అయితే కొన్ని దేశాల్లో వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం అని అన్నారు. కానీ వైరస్ నిర్మూలను నిబంధనలను గాలికి వదిలేస్తే మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదన్నారు. అనేక దేశాల్లో సామూహిక నిరసనలు కొనసాగుతుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. ఇది మరోమారు మహమ్మారి విజృంభించేందుకు కారణమవుతుందని అన్నారు. నిబంధనలు పాటిస్తూ నిరసలు వ్యక్తం చేయాలని అన్నారు. అమెరికాలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story