సరిహద్దుల్లో అదుపులోకి వచ్చిన పరిస్థితులు.. వెనక్కు తగ్గిన చైనా

సరిహద్దుల్లో అదుపులోకి వచ్చిన పరిస్థితులు.. వెనక్కు తగ్గిన చైనా

చైనా, భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొంతమేర తగ్గాయి. చైనా సైన్యం గాల్వన్ సహా.. నియంత్రణ రేఖ వెంబడి మొత్తం మూడు ప్రాంతాలలో రెండున్నర కిలోమీటర్లు వెనక్కు వెళ్లింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉత్కంఠ కాస్త సర్దుమణిగింది. జూన్ 6న ఇరుదేశాల కమాండర్ల మధ్య 5గంటలుపాటు లడ్డాఖ్ లో జరిగిన చర్చల ఫలితంగా రెండు సైన్యాలు వెనక్కు తగ్గాయి. ఈ రోజకు జరిగిన చర్చల్లో సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే, చైనా ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే.. మరోవైపుకవ్వింపు చర్యలకు దిగుతుంది. చర్చలు జరిగిన తరువాత కూడా నియంత్రణ రేఖ వెంబడి చైనా హెలికాప్టర్లు కదలికలు ఎక్కవ అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story