కరోనా నుంచి బయటపడుతున్న న్యూయార్క్

కరోనా నుంచి బయటపడుతున్న న్యూయార్క్

న్యూయార్క్ మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా ప్రభావం నుంచి న్యూయార్క్ బయటపడుతోంది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా అదుపులోకి వచ్చింది. జూన్ 8వ తేదీన ఒక్కటంటే ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఈ వార్త అమెరికన్లకు ఎక్కడా లేని బలం సంపాదించి పెట్టింది. ముఖ్యంగా న్యూయార్క్ ప్రజలను తెగ సంబరపెట్టింది. కరోనాతో ఒ క్కరు కూడా చనిపోకపోవడంతో న్యూయార్క్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా ఆ మహమ్మారి తమను వదిలిపెడుతోందంటూ పండుగ చేసుకున్నారు. మృతుల సంఖ్య జీరోకి చేరుకోవడం తో న్యూయార్క్ మహానగరం మళ్లీ తెరుచుకుంది. దాదాపు అన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకున్నాయి. ఐతే, వైరస్ మళ్లీ ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉంటున్నారు. మాస్క్‌లు ధరిస్తూ శానిటైజేషన్ ఉపయోగిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వైరస్ అంటుకోకుండా చూసుకుంటున్నారు.

కరోనా దెబ్బ బలంగా తగిలిన దేశం అమెరికా. ఈ ఒక్క దేశంలోనే 20 లక్షలకు పైగా కరోనా బాధితులున్నారు. అందులోనూ ఒక్క న్యూయార్క్‌లోనే దాదాపు 4 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరి కా వ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోతే న్యూయార్క్‌లోనే 22 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. దీంతో ఆ మహానగరం కోలుకోలేని విధంగా దెబ్బతింది. వైరస్ బాధితులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడాయి. ఎవరికి వైద్యం చేయాలో, ఎవరిని వదిలేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో వృద్ధులను వదిలేసి యువతీ యువకుల ప్రాణాలను కాపాడడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బాధితులకు చికిత్స చేయడానికి వైద్య సిబ్బంది సర్వశక్తులు ధారపోశారు. రాత్రింబవళ్లు వైద్య సేవలు అందించారు. రిటైర్మెంట్ తీసుకున్న డాక్టర్లు, నర్సులు కూడా కష్టకా లంలో ప్రజలకు సేవలందించడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వం కూడా భారీగా వెంటిలేటర్లు, ఇతర వైద్య సదుపాయాలను సమకూర్చింది. అందరూ కలసికట్టుగా పని చేయడంతో ఎట్టకేలకు కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది.

న్యూయార్క్‌లో మార్చ్ 1వ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. మార్చ్ 11న తొలి కరోనా మరణం సంభవించింది. నెల రోజుల్లోనే కేసుల సంఖ్య వేలల్లోకి మారింది. సోషల్ ట్రాన్స్‌మిషన్ రూపం తీసు కున్న వైరస్, వేలాదిమందిని ఆస్పత్రుల పాలు చేసింది. ఏప్రిల్, మే నెలల్లో కరోనా విలయతాండవం చేసింది. ఆ దెబ్బకు న్యూయార్క్‌ మరుభూమిగా మారిపోయింది. పరిస్థితిని అదుపు చేయడానికి లాక్‌డౌన్ విధించారు. కఠిన ఆంక్షలు అమలు చే శారు. ప్రజలు కూడా పరిస్థితిని అర్ధం చేసుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు రెండున్నర నెలల పాటు న్యూయార్క్‌ను అల్లాడించిన కరోనా ఇప్పు డిప్పుడే అదుపులోకి వస్తోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులో, డజన్ల సంఖ్యలో మరణాలు నమోదైన చోట మొట్టమొదటిసారిగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఐతే, ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉండాలని అధికారులు హెచ్చరించారు. సాధారణ పరిస్థితి ఏర్పడడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story