కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం వ్యూహాలు..

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం వ్యూహాలు..
X

దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టింది. రాష్ట్రాలకు మార్గదర్శనం చేయడంతో పాటు సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక బృందాలను పంపుతోంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సెంట్రల్ టీమ్స్‌ పర్యటిస్తారు. 50కి పైగా జిల్లాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కరోనా వ్యాప్తిని కేంద్ర బృందాలు పరిశీలిస్తాయి. మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఏడేసి జిల్లాల్లో సెంట్రల్ టీంలు పర్యటిస్తాయి. అసోంలో 6, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఒడిశాలలో ఐదేసి చొప్పున జిల్లాలకు కేంద్ర బృందాలు వెళ్తాయి. తెలంగాణా, హర్యానా, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో 4 చొప్పున జిల్లాలను ఎంపిక చేశారు. గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, బెంగాల్‌లలో మూడేసి జిల్లాలున్నా యి. ఆయా జిల్లాల్లో కొవిడ్‌-19 వ్యాప్తి, సంక్రమణను అడ్డుకోవడానికి అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించడంలో స్ధానిక అధికారులకు కేంద్ర బృందాలు మార్గనిర్ధేశకం చేస్తాయి.

ఇక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆప్షన్ వచ్చింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రమే ఆఫీసులకు రావాలని కేంద్రం ఆదేశించింది. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావొ ద్దని సూచించింది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు రావాలని పేర్కొంది. ఎదురె దురుగా కూర్చోవడాన్ని నిషేధించిన కేంద్రం, ఇంటర్‌కాంలోనే మాట్లాడుకోవాలని ఆదేశించింది. మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పనిసరి గా పెట్టుకోవాలని ఆదేశించిన కేంద్రం, మాస్క్‌ పెట్టుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని సూచించింది. కామన్ ఏరి యాలో గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. ఎవరికి వారు తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తోడ్పడాలని సూచించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరిగింది. రోజుకు 10వేల చొప్పున కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాజిటివ్ కేసులు వస్తున్నా యి. సౌత్ బ్లాక్, నీతి ఆయోగ్ ఆఫీసు, జాతీయ మీడియా కేంద్రాల్లో పని చేసే సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో ఆఫీసులకు రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Next Story

RELATED STORIES