సారీ.. అలా మాట్లాడకుండా ఉండాల్సింది: ఖుష్బూ

సారీ.. అలా మాట్లాడకుండా ఉండాల్సింది: ఖుష్బూ
X

జర్నలిస్టులు రాసుకోవడానికి ఇప్పుడు ఏ వార్తలు లేవు ఒక్క కొవిడ్ వార్తలు తప్పించి. ఇంక మనం షూటింగ్ లు మొదలు పెడితే ఫోటోలు, వీడియోలు అంటూ వెంట పడతారు. కానీ అస్సలు ఇవ్వకండి.. సొంతంగా కథలు అల్లేస్తారు. వెంటపడి వేధిస్తుంటారు. కాబట్టి వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఖుష్బూ మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి లీకైంది. దీంతో ఖుష్బూ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడింది తమిళ పాత్రికేయ మండలి.

నిర్మాతల వాట్సాప్ గ్రూప్ లో ఆమె మాట్లాడిన మాటలు ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. వెంటనే తేరుకున్న ఖుష్బూ.. పాత్రికేయులను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదన్నారు. స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడానన్నారు. తనకు ప్రెస్ పట్ల చాలా గౌరవం ఉందని అన్నారు. 34 సినీ జీవితంలో ఎన్నడూ అలా మాట్లాడలేదని తెలిపారు. ఒకవేళ తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించాలని కోరారు. ఇక ఆ ఆడియో క్లిప్ లీక్ చేసిన నిర్మాత ఎవరో తనకు తెలుసని, తన మౌనం, క్షమాగుణమే అతనికి పెద్ద శిక్ష అని తెలిపారు.

Next Story

RELATED STORIES