అమెరికాలో 20 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

అమెరికాలో 20 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని తగ్గించట్లేదు. కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు అమెరికాలో సంభవించాయి. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 20 లక్షల 464 కేసులు నమోదు కాగా, 1,12,924 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపు, జార్జ్ ప్లాయిడ్ మృతికి సంబంధించిన ఆందోళనలు.. వీటన్నిటితో వైరస్ వ్యాప్తి మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణలు ముందే హెచ్చరిచారు. సెప్టెంబర్ నాటికి మరణాల సంఖ్య 2 లక్షలకు చేరుకోవచ్చని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన అశీష్ ఝూ అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story