ఇది దేశానికి పరీక్షా సమయం: ప్రధాని మోదీ

ఇది దేశానికి పరీక్షా సమయం: ప్రధాని మోదీ
X

దేశం మొత్తం కరోనాతో పోరాడుతోందని.. ఇది దేశానికి పరీక్షా సమయమని అన్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు దేశం తన కాళ్లమీద తాను నిలబడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమయంలో స్వదేశీ నినాదం ఊపందుకోవాలని పిలుపునిచ్చారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా.. పారిశ్రామికవేత్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత పురోగతిలో ICC పాత్ర గొప్పదని కొనియాడారు. ఎన్నో దేశాలకు మనం వస్తువులను ఎగుమతి చేస్తున్నామని.. పరిశ్రమల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

Tags

Next Story