చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌పై బీహార్‌లో కేసు నమోదు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌పై బీహార్‌లో కేసు నమోదు
X

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి చైనా దేశమే కారణమంటూ బీహార్ లో ఓ కేసు నమోదైంది. పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టులో నమోదైనా ఈ కేసులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను సూత్రదారిగా చేశారు. అటు, కరోనాపై ప్రపంచ దేశాలకు సరైన సమాచారం అందించడంలో.. ఈ మహమ్మారిపై సరైన అవగాహన కల్పించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని.. ఆ సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ పై కూడా బీహార్ కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు జూన్ 16న విచారణకు రానుంది. అయితే, ఈ పిటిషన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీలను సాక్షలుగా పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES