కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి పరార్..

కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి పరార్..
X

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో హేలట్ ఆస్పతిలో చేరాడు. అతడి శాంపిల్ సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్ట్ పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం వైద్యులు అతడిని కోవిడ్ ఆస్పత్రికి తరలించే పనిలో ఉన్నారు. ఈ లోపు అతడు పరారయ్యాడు. దీంతో ఆస్పత్రిలో కలకలం చెలరేగింది. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ, పోలీస్ బృందాలు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంతవరకూ బాధితుడి ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అతడు వెళ్లి ఎంతమందికి వ్యాధిని సంక్రమింపజేస్తాడో అని ఆందోళనతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Tags

Next Story