జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా..

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శుక్రవారం హైదరబాద్లో కరోనా పరీక్షచేయించుకోగా పాజిటివ్ వచ్చింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డి కుటుంబసభ్యుందరికీ కరోనా టెస్ట్ లు చేశారు. వారి రిపోర్టులు రావలసి ఉంది. ఇంతలోపు వారంతా వైద్య సిబ్బంది సూచన మేరకు స్వీయ నిర్భంధంలో ఉన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ముత్తిరెడ్డి భార్య పద్మలతా రెడ్డి వాట్సప్ లో వాయిస్ రికార్డ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తమ నాయకుడి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలంగాణలో కరోనా బారిన పడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com