భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 11,929 కేసులు

భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 11,929 కేసులు
X

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్య బారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం 11,458 కేసులు నమోదవ్వగా.. ఆదివారం దాదాపు మరో 500 కేసులు అదనంగా రావడం ఆందోళన కలిగిస్తుంది. అటు మరణాల కూడా ఎక్కవ సంఖ్యలో నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు 311 మంది కరోనాతో మరణించారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా రోగుల సంఖ్య 3,20,922 చేరింది. అయితే, ఇప్పటి వరకూ 1,62,379 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 1,49,348 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం 9195 కరోనాతో మ‌‌ృతి చెందారు.

Next Story

RELATED STORIES