పాక్ మాజీ ప్రధానికి కరోనా..

పాక్ మాజీ ప్రధానికి కరోనా..

పాకిస్తాన్‌‌లో ప్రముఖులు ఎక్కవగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో పాక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాక్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి కరోనా సోకిందని తేలింది. ఈ విషయాన్ని గిలానీ కుమారుడు ట్విటర్ వేదికగా తెలియజేశారు. గిలానీకి కరోనా సోకడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కారణమని ఆయన కుమారుడు అన్నారు. నవాజ్ షరీఫ్, అసిఫ్ అలీ జర్దారీలు.. అసలు ధరలో 15శాతం ధరకే తోషఖానా నుంచి లగ్జరీ కార్లు పొందారని.. దీనికి గిలానీ సహకరించారని ఆరోపనలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ముందు విచారణకు హాజరైయ్యారు. ఈవిధంగా ఇమ్రాన్ ఖాన్, ఎన్‌ఏబీ కలిసి తన తండ్రికి కరోనా సోకేలా చేశారని గిలానీ కుమారుడు ఆరోపించారు.

అటు పాక్ లో ప్రముఖులు ఎక్కువగా కరోనాకు గురికావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్ వచ్చిన కొద్ది సమయంలోనే గిలానీకి కూడా పాజిటివ్ రావడం ఆందోళన రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story