కరోనా ప్రధాన లక్షణాలు ఇవే.. వైద్యశాఖ వెల్లడి

కరోనా ప్రధాన లక్షణాలు ఇవే.. వైద్యశాఖ వెల్లడి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బాధితులను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఎలాంటి లక్షణాలు లేకుండానే చాలా మందిలో పాజిటివ్ వస్తోంది. దీంతో ఎవరికి వైరస్ అటాక్ అయిందో తెలుసుకోవడం సమస్యగా మారింది. అయితే కరోనా బాధితుల్లో ప్రధానంగా 8లక్షణాలు కనిపిస్తాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో జ్వరంతోపాటు, జలుబు, కఫం, కండరాల నొప్పి ఉంటాయని స్పష్టంచేసింది. ఎనిమిది లక్షణాలను వెల్లడించింది.

కొవిడ్- 19 సోకిన వారిలో ప్రధానంగా 8 లక్షణాలు కనిపిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అవి 1 జ్వరం, 2 దగ్గు, 3 అలసట, 4 శ్వాస ఇబ్బంది, 5 గొంతులో కఫం, 6 కండరాల్లో నొప్పి, 7 ముక్కు కారటం, గొంతులో మంట, 8 వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు రోగుల్లో కనిపిస్తాయని పేర్కొంది. అయితే వయస్సు పైబడిన వారికి, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో జ్వరం లక్షణాలు లేకపోయినా అలసట, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. పిల్లల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించవు. దీనికి సంబంధించి సమీకరించిన సమాచారం ప్రకారం మొత్తం 15వేలమంది రోగుల్లో లక్షణాలను పరిశీలించగా... 27శాతం మందిలో జ్వరం, 21శాతం మందిలో దగ్గు, 10శాతం మందిలో గొంతుమంట, 8 శాతం శ్వాస సంబంధిత సమస్యలు, 7శాతం వారిలో బలహీనత కనిపించాయి. మిగిలిన 24 శాతం మందిలో ఇతర లక్షణాలు ఉన్నాయని స్ఫష్టంచేసింది.

కరోనా సోకిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, నాడీ, కేన్సర్ వంటి రోగాలతో బాధపడుతున్నవారిలో సాధారణంగా రోగ నిరోధకత తగ్గిపోతుంది. దీనివల్ల వారు వైరస్ బారిన పడితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతుమంట, ముక్కు దిబ్బడ. ఆయాసం, తలనొప్పి లక్షణాలు ఉండి పెద్దగా శ్వాససంబంధిత ఇబ్బందులు లేనివారిని తేలికపాటి కేసుగానే పరిగణిస్తున్నారు. వారికి కేర్ సెంటర్,లేదా ఇళ్లలోనే ట్రీట్ మెంట్ అందించాలని సూచించింది. అలాగే తీవ్ర లక్షణాలు లుకుండా కేవలం నిమోనియా ఉన్న వారిని డెడికేటెడ్ కొవిడ్ హెల్త్ కేర్ సెంటర్ లో చికిత్స అందించాలని పేర్కొంది. ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న కేసులకు అత్యవసర వైద్యం కింద రెమెడిసివిర్ ఇవ్వొచ్చని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story