భారత్ లో కరోనా కేసులు 'కోటి' వరకు.. డైరెక్టర్ 'తేజ' లెక్కలు..

భారత్ లో కరోనా కేసులు కోటి వరకు.. డైరెక్టర్ తేజ లెక్కలు..

లాక్డౌన్ లేదు.. జనాలకి భయం లేదు.. ముఖాలకి మాస్కులు లేవు.. ఇంత వరకు కరోనాకి మందు కనిపెట్టలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని డైరెక్టర్ తేజ సంచలన కామెంట్ చేశారు. ఒక సర్వేలాగా ఆయన చెబుతున్న లెక్కలు పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. కరోనా పెరగడానికి ప్రధాన కారణం నిర్లక్ష్య వైఖరే. ప్రజల ఆలోచనా విధానం మారకపోతే భారత్ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇప్పటికే 10వ స్థానంలో ఉన్న భారత్ గత రెండు వారాల్లో 4వ స్థానానికి చేరుకుంది. ఇది ఇలాగే ఉంటే కేసులు కోటి వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. జాగ్రత్తగా ఉంటున్నాం మనకెందుకు వస్తుందని అని అనుకుంటున్నాం కానీ చేసేది చేస్తున్నాం. ముందు ఆ పద్దతి మారాలి. లేదంటే భారత్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అని తేజ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story