ఒకరికి పాజిటివ్ మరొకరికి నెగిటివ్.. బిడ్డలను మార్చుకున్న తల్లులు

ఒకరికి పాజిటివ్ మరొకరికి నెగిటివ్.. బిడ్డలను మార్చుకున్న తల్లులు

పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. బిడ్డ అనారోగ్యంతో పుడితే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. కరోనాతో పుట్టిన తన బిడ్డను పాజిటివ్ వచ్చిన మరొక తల్లికి ఇచ్చి నెగిటివ్ వచ్చిన ఆమె బిడ్డను తను తీసుకుంది. ఈ అరుదైన సంఘటన సిక్కిం రాష్ట్రంలో చోటు చేసుకుంది. 27 రోజుల పసిబిడ్డకు కరోనా సోకింది. కానీ తల్లిని పరీక్ష చేయగా ఆమెకు రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది. దీంతో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడికి మరో అమ్మ తన ఆరేళ్ల బాబుతో వచ్చింది. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. బాబుని ఇంటి దగ్గర చూసే వాళ్లు ఎవరూ లేరని వెంటబెట్టుకొచ్చింది.

ఈ నేపథ్యంలో ఇద్దరు తల్లులు మాట్లాడుకుని బిడ్డల క్షేమం కోసం ఒక అవగాహనకు వచ్చారు. చికిత్స పొందే వరకు బిడ్డలను మార్చుకుందామనుకున్నారు. దీంతో కరోనా సోకిన 27 రోజుల బిడ్డ బాగోగులను పాజిటివ్ మహిళ చూసుకుంటుంది. నెగిటివ్ వచ్చిన తల్లి ఆరేళ్ల బాలుడిని తన వెంట తీసుకెళ్లింది. వారి నిర్ణయం హర్షించదగినదే అయినా పసిబిడ్డ అమ్మ కోసం ఆరాట పడుతుందేమో అని ఆస్పత్రి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story