తాజా వార్తలు

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా
X

తెలంగాణలో ప్రజా ప్రతినిధులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే.. కరోనాతో ఎమ్మెల్యే బాజిరెడ్డి, గోవర్థన్, ఎమ్మెల్యే బిగాల ముత్తిరెడ్డి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఒకరి తరువాత ఒకరు కరోనాకు గురి కావడంతో అధికార పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు.

Next Story

RELATED STORIES