పెళ్లి వేడుకలో కరోనా పేషెంట్.. 85 మంది అతిధులు క్వారంటైన్ లో..

కరోనా వచ్చిందో రాలేదో తెలియక పోయినా కనీసం ఆ లక్షణాలున్నప్పుడు దూరంగా ఉంటే మంచిది అని బాధితులు ఆలోచించకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. అనారోగ్యంగా ఉన్న మధ్యప్రదేశ్ ఛతర్ పూర్ కి చెందిన వ్యక్తి ఆస్పత్రికి వెళ్తే కరోనా టెస్ట్ చేసి పంపించారు. కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఈ లోపే బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యాడు. వేడుకల్లో మునిగి తేలిన ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని ఆరోజే రిపోర్ట్ వచ్చింది. దీంతో బంధువులంతా హడలిపోయారు. వివాహ వేడుకలకు హాజరైన వ్యక్తి గురుగ్రామ్ నుంచి ఎకాఎకి పెళ్లి వారింటికే వచ్చాడని తెలుసుకున్నారు. అతడికి కరోనా వచ్చిందని తెలిసి ఛతర్ పూర్ జిల్లా అధికారులు వెంటనే అప్రమత్తమై పెళ్లి వారింటికి చేరుకుని హుటాహుటిన అందరినీ క్వారంటైన్ కు పంపించారు. మొత్తం 85 మంది క్వారంటైన్ లో 14 రోజులు ఉండాల్సి వస్తుంది. కరోనా బాదితుడికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com