ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి..: డబ్ల్యూహెచ్ వో

ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి..: డబ్ల్యూహెచ్ వో

కరోనా వైరస్ వ్యాప్తి అతకంతకూ విస్తరిస్తోంది. దీంతో ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి వెళుతోంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమని తెలిపారు. వీటిలో సగానికి పైగా కేసులు రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే నిర్ధారణ అయినట్లు అధనోమ్ అన్నారు. వైరస్ కట్టడికి లాక్డౌన్ శాశ్వత పరిష్కారం కాకపోయినా సడలింపుల అనంతరం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న తరుణంలో ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story