అంతర్జాతీయం

ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య 88 లక్షలు దాటింది. దాదాపు 4 లక్షల 65 వేల మంది కరోనా కారణంగా బలి అయ్యారు. 46 లక్షల 50 వేల మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో కరోనా జూలూ విదిల్చింది. అక్కడ 24 గంటల్లోనే 55 వేల పాజిటివ్ కేసులు నమోద య్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షల 50 వేలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది.

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌తో ప్రజలు విసుగెత్తిపోయారని దీంతో కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని W.H.O హెచ్చరించింది. వైరస్ ఇప్పటికీ వెగంగా వ్యాప్తిస్తోందని, ఇది చాలా ప్రమాదకరమని W.H.O వార్నింగ్ ఇచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతున్నప్పటికీ ఈ మహ్మమారి వల్ల ఇప్పటికీ పెను ప్రమాదం పొంచిఉందని తెలిపింది. కరోనా నివారణకు అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరి కొన్ని నెలల పట్టే అవకాశముందని, అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story

RELATED STORIES