తాజా వార్తలు

కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ కొత్త గైడ్ లైన్స్

కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ కొత్త గైడ్ లైన్స్
X

కొత్త గైడ్ లైన్స్ పాటిస్తే కొంత వరకైనా కరోనాని కంట్రోల్ చేయగలుగుతామేమోనని తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు డ్యూటీ చార్ట్ విడుదల చేసింది. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక వారం 50 శాతం మంది మరో వారం మరో మిగిలిన 50 శాతం మంది పని చేయాలని నిర్దేశించింది.

సర్కారు రూపొందించిన కొత్త డ్యూటీ చార్ట్..

సోమవారం నుంచి బీఆర్కే ఉద్యోగులకు కరోనా సడలింపులు

నాల్గవతరగతి ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు

క్లరికల్ స్టాఫ్ సర్కిల్టింగ్ ఉద్యోగులకు రోజు విడిచి రోజు డ్యూటీ

ప్రత్యేక ఛాంబర్స్ కేటాయించిన ఉద్యోగులు రోజూ విధులకు హాజరు

ముందుగా అనుమతి తీసుకుంటేనే విజిటర్స్ రావాలి

సెక్షన్ అధికారి అసిస్టెంట్ సెక్షన్ అధికారులు డ్యూటీకి రాకపోయినా అందుబాటులో ఉండాలి.

లిప్ట్ లో ఒక్కసారి ముగ్గురు మాత్రమే

పార్కింగ్ ఏరియాలో డ్రైవర్లంతా గుమికూడొద్దు

అధికారులు ఏసీలు వాడకూడదు

Next Story

RELATED STORIES