కరోనా వైరస్ వాతావరణంలో ఎంత టైం ఉంటుందనే పరిశోధనలో ఆసక్తికర విషయాలు

కరోనా వైరస్ వాతావరణంలో ఎంత టైం ఉంటుందనే పరిశోధనలో ఆసక్తికర విషయాలు

కరోనా వైరస్ ప్రభావం ఏ వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది? బహిరంగ ప్రదేశాల్లో వైరస్ ఎంతసేపు బతికి ఉంటుంది? ఇదే అంశాలపై అమెరికా శాస్త్రవేతలు చేసిన ప్రయోగాల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ ఎక్కువగా చలి కాలంలో వ్యాప్తి చెందుతుందని ఖచ్చితమైన శాస్త్రీయ విధానం ద్వారా నిర్ధారించుకున్నారు. వైరస్ వేడి వాతావరణంలో ఎక్కువసేపు ఉండలేదని ఓ అవగాహన ఉన్నా.. వేడి వాతావరణంలో దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు శాస్త్రవేతలు ఈ ప్రయోగం చేపట్టారు. కరోనా పేషెంట్ దగ్గరి నుంచి తీసుకున్న శాంపుల్స్ ను వివిధ వాతావరణ పరిస్థితుల్లో వారం రోజుల పాటు పరిశీలించారు. ఈ ఏడు రోజుల పాటు మూడు రకాల ఉష్ణోగ్రతలు.. తేమ పరిస్థితుల వద్ద వైరస్ ఎలాంటి ప్రభావానికి లోనవుతోందనే అంశాలపై అధ్యయనం చేశారు.

వాతావరణంలో తేమ, వేడిని బట్టి కరోనా వైరస్ 12 గంటల నుంచి 48 గంటల వరకు బతికేఉంటుంది. తక్కువ తేమ, తక్కువ వేడి ఉన్న వాతావరణంలో వైరస్ చాలా స్థిరంగా ఉంటోందని గుర్తించారు. అయితే.. ఎక్కువ వేడి, తేమ ఉన్న వాతావరణంలో మాత్రం వైరస్ జీవితకాలం సగానికి తగ్గిపోతోంది. దీంతో వైరస్ వ్యాప్తిపై వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిర్ధారణకు వచ్చారు. అంటే ఎండాకాలంలో వైరస్ వ్యాప్తి వేగం తగ్గినా..మళ్లీ చలి వాతావరణంలో విజృంభించే అవకాశాలు ఉంటాయి. ప్రతియేడు సీజనల్ వ్యాధిలాగే కరోనా కూడా వ్యాప్తిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆవి, అతినీలలోహిత కాంతితో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story