మాకు కరోనా లేదు.. మేం బానే ఉన్నాం..: విఘ్నేశ్, నయన్

మాకు కరోనా లేదు.. మేం బానే ఉన్నాం..: విఘ్నేశ్, నయన్
X

తమిళ నాట చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నటులు నయన తారకు ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ కు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాళ్లిద్దరూ హోంక్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని వార్తలు దర్శనమిచ్చాయి. దీంతో వారిపై వస్తున్న రూమర్లకు బ్రేకిచ్చారు విఘ్నేశ్. అవన్నీ నిజం కాదు. మేమెంతో ఆరోగ్యంగా ఉన్నామంటూ నయన్, విఘ్నేశ్ చిన్న పిల్లల్లా మారి డ్యాన్స్ చేసినట్లు ఉన్న ఓ వీడియోని పోస్ట్ చేశారు.

ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్న జోకర్స్ ని, వాళ్ల జోక్స్ ని చూసి నవ్వుకునేందుకు దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు అని విఘ్నేశ్ పేర్కొన్నారు. ఇక నయనతార.. మూకుతి అమ్మన్, కాతు వక్కుల రెండు కాదల్ అనే చిత్రాలతో బిజీగా ఉంది. విఘ్నేశ్.. అంజలి, కల్కి కొచ్చిన ప్రధాన తారాగాణంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Next Story

RELATED STORIES