పాకిస్తాన్ విమాన ప్రమాదానికి కరోనా మహమ్మారే కారణం

పాకిస్తాన్ విమాన ప్రమాదానికి కరోనా మహమ్మారే కారణం

పాకిస్తాన్ లోని కరాచీలో మే22 న విమానం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి ముఖ్య కారణం కరోనా మహమ్మారేనని పాకిస్థాన్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. పైలట్లు కరోనా గురించి మాట్లాడుతూ.. విమానం నడపడంలో నిర్లక్ష్యం వహించారని అన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అందరూ.. దీనికి కారణం విమానంలో సాంకేతిక లోఫం కారణమని అనుకున్నారు. అయితే, విమానం నూటికి నూరు శాతం ఫిట్ గా ఉందని.. ఎలాంటి సాంకేతిక లోపం లేదని తెలిపారు. పైలట్లు కూడా అపార అనుభవం ఉన్నవారేనని.. అయితే, కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ.. విమానం నడపడంపై నిర్లక్ష్యంగా ఉన్నారని... కాక్ పిట్ వాయిస్ రికార్డు ద్వారా తెలుస్తుంది. ల్యాండింగ్ విషయంలో కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటినీ.. నేను చూసుకుంటానని బదులిచ్చాడని తెలుస్తుంది. అయితే, చివరిలో పరిస్థితి ఆయన చేతులు దాటిపోయినపుడు ఓ గాడ్ ఓ గాడ్ ఓ గాడ్ అనే అరిచాడని తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story