అప్పుడే షోరూమ్ నుంచి బయటకు వచ్చాడు.. అంతలోనే రూ.2 కోట్ల కారు..

అయ్యో.. నా కారు.. రెండు కోట్లు పెట్టి ఇప్పుడే కొన్నాను. ఇంతలోనే ఇలా అయ్యిందేమిటని లబో దిబో మంటున్నాడు లంబోర్గి కారు కొనుక్కున్న యజమాని. దురదృష్టమని చెప్పాలో అదృష్టమని చెప్పాలో తెలియని పరిస్థితి. రూ.2 కోట్లు పెట్టి కారు కొని గంట కూడా కాలేదు.. కళ్ల ముందే తుక్కు తుక్కు అయింది. బ్రిటన్ లోని వేక్ ఫీల్డ్ కి చెందిన వ్యక్తి రూ.2 కోట్లు పెట్టి గ్రే కలర్ లంబోర్గిని హరికేన్ స్పైడర్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. షోరూం నుంచి బయటకు వచ్చి కొత్త కారులో కొంత దూరం ప్రయాణించాడు. ఏ నాటిదో ఈ కల నెరవేరింది ఈ రోజు అని హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలోనే సడెన్ గా రోడ్డు మధ్యలో కారు ఆగిపోయింది. ఏమైందో చూద్దామని కారు దిగాడు. ఈ లోపు వేగంగా వచ్చిన మరో కారు అతడి కారుని ఢీకొట్టింది. అంతే కారు పాత సామాను అమ్ముకునే వాడి కొట్లో వేసేలా అయిపోయింది. అతడు మాత్రం సేఫ్ గా బయటపడ్డాడు. కారు కొన్న 20 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎంతో ఆవేదనకు గురై పోలీసులకు సమాచారం అందించాడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అంటే ఇదేనేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com