కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో పాక్‌పై మండిపడ్డ భారత్

కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో పాక్‌పై మండిపడ్డ భారత్

కర్తార్ పూర్ కారిడర్ పునఃప్రారంభిస్తామని పాకిస్తాన్ ప్రకటించడంతో.. భారత్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడెన్ గా ఎలా అలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తుంది. కరోనా నేపథ్యంలో సరిహద్దులు మూసివేయడంతో.. ఈ విషయంపై లోతుగా చర్చించి తమ నిర్ణయం తెలియజేస్తామని భారత్ అధికారులు స్పష్టం చేశారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం కనీషం వారం రోజులు ముందైనా భారత్ సమాచారం అందించాల్సి ఉంటుంది. అయితే, కేవలం రెండు రోజులు ముందు మాత్రమే తెలియజేయటంతో.. పేర్లు నమోదుకు భారత్ కు తగిన సమయంలేకపోవడంతో ఈమేరకు మండిపడుతోంది. అటు, రావీ నది ప్రాంతంలో పర్యాటకుల సౌకర్యార్థం పాక్.. ఓ వంతెన నిర్మిస్తుంది. అయితే, ఈ వంతెన ఇప్పటి వరకూ ఓ కొలిక్కిరాకపోవడంతో.. ఈ వర్షాకాలంలో పర్యటనలు సాఫీగా సాయగుతాయా? అనేది అనుమానమే. దీనిపై భారత్ లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story