మృత్యుంజయుడు.. కరోనాను జయించి వైద్యులనే ఆశ్చర్యపరిచాడు

బ్రిటన్ లో ఓ వ్యక్తి కరోనా తో మూడు నెలలకు పైగా పోరాడి.. చివరికి మహమ్మారిని ఓడించి ఇంటికి పయనమైయ్యాడు. అయితే, ఆయన కోలుకోవడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. వాట్సన్ అనే వ్యక్తి కరోనాతో 95 రోజులపాటు పోరాటం చేశాడు. 41 రోజుల పాటు ఐసీయూలో ఉన్న వాట్సన్ 23 మూడు రోజులు కోమాలో ఉన్నారు. అయితే, ఆయన బ్రతుకుతాడనే నమ్మకం లేక వైద్యులు.. ఆయన కుటుంబ సభ్యులకు కూడా చెప్పేశారు. కానీ, అందరి అంచనాలు తలకిందుల చేసి ఆయన పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య, పిల్లలను కలుసుకున్నారు. వాట్సన్ డిశ్చార్జ్ అయినపుడు వైద్య సిబ్బంది ఆయనను అభినందనలతో ముంచెత్తారు. అటు, ఇంటికి చేరుకున్న ఆయనను స్థానికులు కూడా చప్పట్లు, అరుపులతో సాధర స్వాగతం పలికారు. కరోనాను జయించి తాను ఇంటికి చేరానంటే నమ్మలేకపోతున్నానని వాట్సన్ కూడా స్థానికులతో చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com