ద్వితీయార్థంలో ఆవిరి కానున్న 34 కోట్ల ఉద్యోగాలు..

ద్వితీయార్థంలో ఆవిరి కానున్న 34 కోట్ల ఉద్యోగాలు..

కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగింది. అయితే, ద్వితీయార్థంలో మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తే.. 34 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. ఇది మొత్తం 11.9 శాతం పనిగంటలతో సమానమని తెలిపారు. 2020 ద్వితీయ త్త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 14 శాతం పనిగంటలు తగ్గాయని.. ఐఎల్ఓ నివేదిక తెలిపింది. గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఈ ఏడాది నిరుద్యోగిత రేటు ఉందని ఈ నివేదిక తెలిపింది. కొన్ని దశాబ్ధాలుగా స్త్రీపురుషుల అసమానతలు తగ్గించే దిశగా సాధించిన ప్రగతిని సైతం ఈ మహమ్మారి వెనక్కు నెట్టేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ఎక్కువగా మహిళా ఉద్యోగులపై ప్రభావం చూపిందని, ప్రపంచంలోని పలు దేశాలు వారిపైనే వేటు వేసి ఉద్యోగాల నుంచి తొలగించిందని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story