తాజా వార్తలు

తెలంగాణలో ఒక్కరోజే 1590 పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఒక్కరోజే 1590 పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా రెండు రోజులుగా 1800కు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

GHMC పరిధిలోనే 1277 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23902కి చేరింది. యాక్టివ్ కేసులు 10904 ఉన్నాయి. ఆదివారం 1166 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినుండి రాష్ట్ర వ్యాప్తంగా 12703 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి ఒక్కరోజే 7 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి 295 మంది మృతి చెందారు.

Next Story

RELATED STORIES