రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ డేట్ ఫిక్స్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ లో వస్తున్న ఈ మూవీని 'జిల్' సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రభాస్‌కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.

ఇక ఈ సినిమాకు 'జాన్' అనే టైటిల్ ను అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్‌ని పెట్టాలేదని టాక్. ఈ మూవీ 'రాధా శ్యామ్' అనే మరో టైటిల్ కూడా పెడతారనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. జులై 10న ఉదయం 10 గంటలకు మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు మూవీ టైటిల్‌ను కూడా అనౌన్స్ చేయనుంది చిత్ర బృందం. సాహో సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇంతవరకు బిగ్ స్క్రీన్ మీద ప్రభాస్ ని చూడలేదని వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్న.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూస్.

ఇది ఒక రొమాన్స్ సంబంధించిన సినిమా అని టాలీవుడ్ టాక్ . చాలా రోజుల నుంచి ప్రభాస్ ని లవర్ బాయ్ గా చూడాలనుకున్న ప్రేక్షకులకు ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమే. అప్పుడెప్పుడో 2010 సంవత్సరంలో కాజల్ తో కలిసి నటించిన డార్లింగ్ సినిమాలో నటించిన ప్రభాస్ అప్పటి నుంచి ఇక లవర్ బాయ్ సినిమాలో అసలు చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల ఊహాగానాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

Next Story

RELATED STORIES