తనపై ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టిక్‌టాక్

తనపై ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టిక్‌టాక్
X

టిక్ టాక్ సంస్థ తనపై పడ్డ మరకలు చెరుపుకునే ప్రయత్నాలు చేస్తోంది. చైనా యాప్ టిక్‌టాక్ వలన యూజర్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందనే కారణంతో భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అటు, అమెరికా కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నామని ట్రంప్ ఇటీవల తెలిపారు. దీంతో టిక్‌టాక్ మాత‌ృసంస్థ అప్రమత్తమైంది. తన ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, ఎక్కడకు మార్చుతుందో అనే విషయం తెలపలేదు. టిక్‌టాక్ గతంలో లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, డబ్లిన్, ముంబాయిలో తమకు అతి పెద్ద కార్యాలయాలు ఉన్నాయని తెలిపింది. వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందని ఆరోపణలతో టిక్ టాక్.. అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను దూరం చేసుకుంది.

Tags

Next Story