మొదటిసారి మాస్క్‌తో కనిపించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్క్ తో కనిపించారు. అమెరికాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ధరించని ట్రంప్ తొలిసారి ఇలా కనిపించడం గమనార్హం. మేరీలాండ్ లో ఓ సైనిక ఆస్ప్రత్రిని సందర్శించేందుకు వెళ్లిన ట్రంప్ నలుపు రంగు మాస్క్ తో వెళ్లారు. సైనిక కేంద్రంలో గాయపడిన సైనికులు, ఆరోగ్యకార్యకర్తలతో కలసి మాట్లాడారు. ఆ సమయంలో మాట్లాడిన ట్రంప్ తాను మాస్క్ ధరించడానికి వ్యతిరేకం కాదని.. అయితే, మాస్క్ పెట్టుకోవడానికి కూడా ఒక సమయం ఉంటుందని అన్నారు. తాను సైనిక ఆస్పత్రిని సందర్శించడానికి వచ్చానని.. ఈ సమయంలో మాస్క్ అనివార్యమని అన్నారు.
అయితే, ట్రంప్ మాస్క్ ధరించడాన్ని జో బిడెన్ ప్రచారకర్తలు ప్రచారంలో వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పడు మాస్క్ ధరించి ఉంటే బాగుందని.. అలా చేయకుండా.. ప్రజలను ట్రంప్ నిరాశపరిచారని అన్నారు. కానీ, జో బిడెన్ మాత్రం ఆరంభం నుంచే మాస్క్ వాడుతున్నారని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com