సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుదల చేసింది. త‌న అధికారిక వెబ్‌సైట్‌లో ఫ‌లితాల పూర్తి వివ‌రాల‌ను సీబీఎస్ఈ పొందుప‌రిచింది. cbseresults.nic.in పోర్ట‌ల్ నుంచి విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు.

ఈ ఏడాది 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. గ‌తేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణ‌త శాతం పెరిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రీక్ష‌లు పాసై వారికి కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ నిశాంక్ కంగ్రాట్స్‌ చెప్పారు.

ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30, 2020 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ దేశంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పేపర్లు వాల్యువేషన్‌లో జాప్యం జరిగింది. ఇక అన్‌లాక్‌ అమల్లోకి రావడంతో పేపర్ వాల్యుయేషన్ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది.

Tags

Read MoreRead Less
Next Story