మరో సీరియల్ నటుడికి కరోనా

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సీరియల్స్ షూటింగ్స్ మొదలు పెట్టినా నటీ నటులు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తెలుగు సీరియల్ నటులు ఇద్దరు ముగ్గురికి కరోనా సోకింది. తాజాగా మరో నటుడు భరద్వాజ్ రంగా విజ్జులకు ఆదివారం కరోనా సోకినట్లు తెలిపారు. ఈ విషయం ఆయనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. స్వాతిచినుకులు, బంధం సీరియల్స్ లో నటిస్తున్న భరద్వాజ్ బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించి పోస్ట్ లో వివరంగా పేర్కొన్నారు. లక్షణాలు ఏవీ లేవని, ఎవరూ భయపడవద్దని సూచించాడు. సరైనా ఆహార నియమాలు పాటిస్తూ డాక్టర్ల సూచనమేరకు ఔషధాలు తీసుకుంటే వ్యాధి నుంచి బయటపడవచ్చని తెలిపాడు. అయితే తనతో కలిసి పని చేసిన నటీనటులు, యూనిట్ సభ్యులు అందరూ ఐసోలేషన్ లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భరద్వాజ్ కి కరోనా సోకిన విషయం తెలియగానే త్వరగా కోలుకోవాలని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com