పెళ్లై పదిరోజులు కూడా కాలేదు.. ప్రేమించిన వాడొచ్చి..

పెళ్లై పదిరోజులు కూడా కాలేదు.. ప్రేమించిన వాడొచ్చి..
X

హర్యానా గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ నవవధువును చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. నాన్ కౌన్ గ్రామానికి చెందిన రాజేశ్ అదే గ్రామానికి చెందిన ప్రియాంకతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. రాజేశ్ కు అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. ఈ క్రమంలో ప్రియాంక జూన్ 29 న పెళ్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లింది. శనివారం ప్రియాంక అమ్మగారింటికి వచ్చిందని తెలుసుకున్నాడు రాజేశ్. ఇంటికి వెళ్లి ఆమెను దాబా వద్దకు వెళదాం అని పిలిచాడు. అతడితో పాటు వెళ్లిన ఆమెను అక్కడే తుపాకితో కాల్చి చంపేశాడు. అనంతరం తాను కాల్చుకుని మరణించాడు. ఇప్పుడే వస్తానని వెళ్లిన ప్రియాంక సాయింత్రం అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో దాబా వద్ద ప్రియాంక , రాజేశ్ ల మృతదేహాలు పక్కపక్కనే పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వారి దగ్గర తుపాకీ పడి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES