15 గంటల పాటు సాగిన భారత్, చైనా చర్చలు

15 గంటల పాటు సాగిన భారత్, చైనా చర్చలు

సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను తొలగించడానికి భారత్‌-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన భారత్‌-చైనా కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు, బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పూర్తయ్యాయి. సుమారు 15 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. గల్వాన్‌ లోయలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇంత సుదీర్ఘంగా చర్చలు జరగడం ఇదే మొదటిసారి. ఈ సమావేశానికి సంబంధించి చర్చల నిర్ణయాలు తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story