యూఏఇకి తిరిగి వచ్చే ప్రయాణికులు ప్రభుత్వ అనుమతి పొందిన ల్యాబుల్లో మాత్రమే..

యూఏఇకి తిరిగి వచ్చే ప్రయాణికులు ప్రభుత్వ అనుమతి పొందిన ల్యాబుల్లో మాత్రమే..

అబుదాబి మరియు దుబాయ్‌లకు ప్రయాణించే భారతీయులు బయలుదేరే 96 గంటల ముందు కొవిడ్-19 పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి. షార్జాకు ప్రయాణించే ప్రవాసుల కోసం, బయలుదేరే ముందు 72 గంటల కంటే ముందుగానే పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ తీసుకోవాలి. ఇంకా, ప్రభుత్వం ఆమోదించిన ప్రయోగశాల నుండే పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.

భారతీయులను యూఏఇకి తిరిగి పంపే విమానాలను నడుపుతున్న ఐదు విమానయాన సంస్థలలో మూడు యుఎఇ విమానయాన సంస్థలు ఉన్నాయి మరియు ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్నవారు జూలై 12 నుండి 26 వరకు యుఎఇకి తిరిగి రావాలి. ఇది ఇరు దేశాల పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం .

ప్రత్యేక విమానాలలో యుఎఇకి తిరిగి ప్రయాణించిన ప్రయాణీకులు కొంతమంది నివాసితులు విమానంలో ఎక్కడానికి అనుమతించబడలేదు. ఎందుకంటే వారి పరీక్షలు గుర్తింపు లేని కేంద్రాల్లో జరిగాయి.

భారతదేశంలోని సర్టిఫైడ్ ల్యాబ్‌ల వివరాల కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యగలరు.

https://www.icmr.gov.in/…/l…/COVID_Testing_Labs_10072020.pdf

Tags

Read MoreRead Less
Next Story