తాజా వార్తలు

కరోనాతో ఎవరూ మృతి చెందకూడదు: గవర్నర్ తమిళిసై

కరోనాతో ఎవరూ మృతి చెందకూడదు: గవర్నర్ తమిళిసై
X

రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మృతి చెందకూడదని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఇదే తన లక్ష్యమని ఆమె అన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆమె తెలంగాణ ప్రజలు కరోనాను జయించాలని అన్నారు. ప్రతీఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తే.. చాలా వరకు కరోనాను కట్టడి చేయవచ్చని అన్నారు. కరోనాతో సీరియస్ గా ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తే.. మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నవారు ప్లాస్మా దానం చేయాలని కోరారు. అలా దానం చేసిన వారికి పుష్పగుచ్చంతో అభినందించారు.

Next Story

RELATED STORIES