వైరస్ తో పోరాటం.. విటమిన్ 'డి' తోనే సాధ్యం

వైరస్ తో పోరాటం.. విటమిన్ డి తోనే సాధ్యం

చాలా రకాల జబ్బుల నివారణకు విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. నగర జీవి నాలుగ్గోడల మధ్యే ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు కానీ కాస్త బయటకి వచ్చే ఎండలో నిలబడే తీరిక ఎవరికీ దొరకట్లేదు. ప్రకృతి సహజసిద్ధంగా అందించే డి విటమిన్ ని కోల్పోతున్నాం. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ని అంతమొందించాలంటే కచ్చితంగా డి విటమిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యులు. డి విటమిన్ లోపం రోగనిరోధక శక్తిపైన ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత డి విటమిన్ అందిస్తే వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని అంటున్నారు.

కొవిడ్ మహమ్మారి నగరాల్లో విస్తృతంగా ప్రబలడానికి కారణం డి విటమిన్ లోపమని తెలిపారు. కొవిడ్ మరణాల కేసును పరిశీలిస్తే అధికంగా డి విటమిన్ లోపం ఉందని గుర్తించారు. నగర జనాభాలో డివిటమిన్ లోపంతో బాధపడవారు 80 శాతం మంది ఉంటే అందులో విద్యార్థులే అధిక శాతంలో ఉన్నట్లు వెల్లడి. సూర్యరశ్మితో పాటు చేపలు, లివర్ లో అధికంగా ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉండే చేపల్లో సమృద్ధిగా లభిస్తుంది. శాకాహారంలో తక్కువగా ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటాడు. ఈ సమయంలో కిరణాలు శరీరాన్ని తాకితే డి విటమిన్ తగినంత అందుతుంది. ఎంత మొత్తంలో ఉంది అనేది ఏడాదికి ఒక సారి పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది. సరైన మోతాదులో లేకపోతే ఔషధాలు వాడి అనేక రుగ్మతల బారిన పడకుండా ఉండొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story