కరోనా వ్యాక్సిన్ తయారీలో ఓ పెద్ద మైలురాయిని దాటాం: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ

కరోనా వ్యాక్సిన్ తయారీలో ఓ పెద్ద మైలురాయిని దాటాం: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ

కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. తాము కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో మొదటి మైలురాయి దాటామని అన్నారు. తాము కనిపెడుతున్న వ్యాక్సిన్ కరోనా బాధితులను కాపాడుతుందనే నమ్మకాన్ని కలిగించడమే తాము చేరుకున్న మైలురాయని ప్రముఖ శాస్త్రవేత్త ఆండ్రూ పొలార్డ్ అన్నారు. కరోనా నుంచి కోలుకునేందుకు వ్యాక్సిన్ సహాయపడుతుందని ఫేజ్-1 ట్రయల్స్‌లో స్పష్టమైందని, అయితే.. కరోనాను నయం చేసేలా తమ వ్యాక్సిన్ పనిచేస్తుందని నిర్ధారించాల్సి ఉందని ప్రొఫెసర్ సారా గిల్‌బర్ట్ చెప్పారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితమని, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ ఇప్పటికే వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story