బంగ్లాదేశ్ వరద బాధితులను మానవత్వంతో ఆదుకోవాలి: ఐక్యరాజ్యసమితి

బంగ్లాదేశ్ వరద బాధితులను మానవత్వంతో ఆదుకోవాలి: ఐక్యరాజ్యసమితి
X

భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలను, బంగ్లాదేశ్ ను కరోనాతో పాటు వరదలు కూడా ఆందోళనలకు గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో వరదల వల్ల 54 మంది మరణించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అక్కడ గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాల వలన లోతట్టుప్రాంతాలు ముంపుకు గురైయ్యాయి.దీంతో 56వేల మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ చెప్పారు. వరదల ప్రభావం సుమారు 2.4 మిలియన్ల మందిపై పడింది. వరదలతో బంగ్లాదేశ్ లో చాలా మంది ఆకలితో అల్లాడుతున్నారని.. వారికి మానవత్వంతో ఆహారం, మంచినీరు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. వరదబాధితులను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ద్వారా 5.2మిలియన్ల అమెరికా డాలర్లను ఇచ్చామని డుజారిక్ చెప్పారు.

Tags

Next Story