భారీవర్షాలకు కొండచరియలు విరిగి పడి 132 మంది మృతి..

భారీవర్షాలకు కొండచరియలు విరిగి పడి 132 మంది మృతి..
X

గత కొన్ని రోజులుగా కురుస్తున్నభారీ వర్షాల కారణంగా నేపాల్ లో కొండచరియలు విరిగిపడి 132 మంది మరణించారు. ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. 128 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 53 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఒక్క మయాగ్డి ప్రాంతంలోనే 27 మంది మరణించినట్లు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది ప్రజలు స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాల్లో తల దాచుకున్నారు. వర్షాల కారణంగా నారాయణి సహా ఇతర ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి.

Tags

Next Story