అంతర్జాతీయం

మరోసారి చైనాలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు

మరోసారి చైనాలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు
X

చైనాలో మరోసారి కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో 13 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, తాజాగా వచ్చిన కేసులన్నీ దేశీయంగా వ్యాప్తి చెందినవేనని స్థానిక మీడియా తెలిపింది. ఈ కేసులన్నీ రాజధాని ఉరుంకిలోనే నమోదయ్యాయని తెలిపింది. మరోవైపు అదే ప్రాంతంలో లక్షణాలు లేకుండా మరో 19 కేసులు బయటపడ్డాయని.. తాజా కేసులతో కలుపుకుని జిన్జియాంగ్‌లో మొత్తం 95 కేసులు నమోదు కాగా, వీటిలో 85 కేసుల్లో లక్షణాలు లేవని జిన్హువా పేర్కొంది. అటు మరో 3,346 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నట్టు తెలిపింది.

Next Story

RELATED STORIES