మావల్ల కాదు.. మేమేం చేయలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం

మావల్ల కాదు.. మేమేం చేయలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం

కరోనాతో కలిసి సహజీవనం చేస్తున్నారు.. వచ్చినా పట్టించుకోవడం మానేశారు. పైగా వైరస్ వచ్చిందని తెలిస్తే చుట్టుపక్కల వాళ్లు అదోలా చూస్తున్నారని, అపార్ట్ మెంట్ వాసులైతే ఇళ్లలోకి రానివ్వడం లేదని.. మొత్తానికి ఏదో ఒక సాకుతో వైద్యులకు అందుబాటులోకి లేకుండా పోతున్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని కొందరుంటే, మరికొందరు తప్పు నెంబర్లు ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ వ్యక్తులు ప్రజల మధ్య తిరుగుతున్నారని ట్రేసింగ్, టెస్టింగ్ కష్టమవుతోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.

టెస్ట్ ఫలితాలు నాలుగైదు రోజులు ఆలస్యం కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక హోం ఐసోలేషన్ లో ఉన్న వారు సొంత వైద్యం చేసుకుంటూ ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్నారు. దాదాపు 3 వేల మంది కరోనా రోగులు కాంటాక్ట్ లో లేరని అధికారులు చెబుతున్నారు. సరుకులు తెచ్చుకోవడానికి, మెడికల్ షాపులకు పాజిటివ్ వ్యక్తులు వెళుతున్నట్లు తెలుస్తోంది. కాగా జీహెచ్ఎంసీలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరుకుంది.

దాదాపు 28 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్లో ఉన్నామని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించినప్పటికీ పాజిటివ్ వ్యక్తులు పట్టించుకోవట్లేదు. దీంతో హైదరాబాదులోని పలు ఏరియాలో హైరిస్క్ జోన్లుగా మారుతున్నాయి. ప్రమాదకర సర్కిళ్లు.. యూసఫ్ గుడా, అంబర్ పేట, చాంద్రాయణ గుట్ట, చార్మినార్, మెహదీపట్నం, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్.

Tags

Read MoreRead Less
Next Story