లక్షలు ఖర్చెందుకు.. కషాయంతో కరోనాకు చెక్: హరీష్ రావు

లక్షలు ఖర్చెందుకు.. కషాయంతో కరోనాకు చెక్: హరీష్ రావు

మన ఆరోగ్యమే మనల్ని కాపాడుతుంది. మన అలవాట్లే మనల్ని రక్షిస్తాయి. సహజసిద్దంగా ఉండే ఇమ్యూనిటీ కొంతైతే భారతీయులు తీసుకునే ఆహారంలో కూడా రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు కథా పానీయం ఉత్తమమైనది మన ప్రధాని మోదీ ముందే సెలవిచ్చారు. తాజాగా సిద్ధిపేటలో ఉచిత కషాయ కేంద్రాన్నే ఓపెన్ చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. హరేకృష్ణ మూవ్‌మెంట్, మెగా కంపెనీ సహకారంతో కషాయ వితరణ కేంద్రాన్ని మంత్రి శనివారం ఉదయం ప్రారంభించారు. కషాయం తాగండి.. కరోనాను జయించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ప్రభుత్వానికి సహకరించండి అని ఆయన అన్నారు.

ఉచిత కషాయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ, యోగా, వ్యాయామంతో పాటు చక్కని ఆరోగ్య అలవాట్లు పెంపొందించుకుంటే మహమ్మారి మన దరిచేరకుండా ఉంటుందని తెలిపారు. తనని ఎన్నుకున్న ప్రజల ఆరోగ్యాన్ని కోరే నాయకుడు హరీష్ రావు.. సిద్ధిపేటకు వచ్చే ప్రజల కోసం 3 వేడినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు వేడినీరు, కషాయం తాగితే కరోనా నుంచి బయటపడవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కషాయం తాగడాన్ని ఓ అలవాటుగా చేసుకోవాలని అన్నారు. కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చుచేయొద్దని అన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారికోసం 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్ అందిస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story