కరోనా లక్షణాలు కనిపెట్టేందుకు శునకాలకు శిక్షణ

కరోనా లక్షణాలు కనిపెట్టేందుకు శునకాలకు శిక్షణ

పోలీసులు చాలా కేసులను శునకాల సాయంతో చేధిస్తారు. అయితే, క్రిమినల్ కేసులకు చేధించడంలోనే కాకుండా.. పలు వ్యాదులు ఉన్న వారిని గుర్తించడంలో కూడా శునకాలు ఉపయోగపడతాయి. తాజాగా శునకాలకు ట్రైనింగ్ ఇస్తే.. కరోనాను కూడా పసిగడుతున్నాయిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విదేశాల్లో స్నిప్పర్స్ డాగ్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. దీంతో కరోనా లక్షణాలును కనిపెట్టే పనిలో అధికారులు ఉన్నారు. శునకాలు బాణం విసిరినట్టు తిన్నగా పరిగెడితే.. భూకంపం వస్తుందని పూర్వీకులు నమ్ముతారు. ఒక్కసారి వాసన పసిగడితే దేన్నయినా ఇట్టే గుర్తించగలవు. ఈ ప్రత్యేకమైన లక్షణాలు కుక్కల్లో ఉండడంతో మనుషుల్లో ఉండే క్యాన్సర్, షుగర్, మలేరియా వంటి వ్యాథులను గుర్తించడానికి వాటిని ఉపయోగిస్తున్నారు. కాగా.. యావత్ ప్రపంచం కరోనాతో అతలాకుతలం అవుతుంది. దీంతో కరోనా లక్షణాలు ఉన్న వారిని కనిపెట్టేందుకు లండన్, అమెరికా వంటి దేశాలల్లో స్నిఫ్పర్ డాగ్స్‌కు శిక్షణ ఇస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story