తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 2083 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2083 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2083 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు శనివారం హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 64,786కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుంచి ఇప్పటి వరకూ 46,502 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 530కి చేరింది.

Next Story

RELATED STORIES