తాజా వార్తలు

తెలంగాణలో కొత్త‌గా 1819 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్త‌గా 1819 క‌రోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1819 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 517 కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 66,677కు చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 47,590 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 18,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా కొత్త‌గా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 540కి చేరాయి. ఇక రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 71.3 శాతంగా ఉంది. ఇక మ‌ర‌ణాల రేటు 0.80 శాతంగా ఉంది.

Next Story

RELATED STORIES